అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్‌ను సందర్శించనున్నట్లు వర్గాలు పేర్కొ్న్నాయి. గత నెలలో జేడీ వాన్స్.. ఫ్రాన్స్, జర్మనీలో తొలి విదేశీ పర్యటన చేశారు. రెండో విదేశీ పర్యటన భారత్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన 124 బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేయనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కొత్త టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎరుపు రంగు టెస్లా కారును కొనుగోలు చేశారు. అనంతరం కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ కలియ తిరిగారు. తన స్నేహితుడికి మద్దతుగా కొత్త టెస్లా కారు కొంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ కారు కొనుగోలు చేసి వైట్‌హౌస్ ఎదుట డ్రైవింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.
బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. డీఆర్ఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తు్న్నారు. ఈ కేసులో అరెస్టైన నటి రన్యారావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ దిశగా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో రన్యారావు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం భారీగా సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే పరిస్తితి ఏర్పడింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యారావు కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.
పాకిస్థాన్ రాయబారి అహ్సాన్ వాగన్‌ను అమెరికా బహిష్కరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెల్లుబాటు అయ్యే వీసా, అలాగే చట్టపరమైన ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ లాస్ ఏంజిల్స్ నుంచి బహిష్కరణకు గురైనట్లు సమాచారం. అహ్సాన్ వాగన్.. తుర్క్మెనిస్తాన్లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు.
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. దీంతో వందలాది మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది.
డొమినికన్ బీచ్‌లో తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి ఆచూకీ ఇంకా లభించలేదు. వారం రోజులు అవుతున్నా జాడ మాత్రం దొరకలేదు. ఐదుగురు స్నేహితులతో కలిసి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది. పుంటా కానాలోని రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది. దీంతో స్నేహితుల సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు.