Suchir Balaji: సుచిర్ బాలాజీ మృతికి ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఫొటో!
- సుచిర్ బాలాజీ మృతికి ముందు ఏం జరిగింది
- తాజాగా వెలుగులోకి సీసీటీవీ ఫొటో!
- ఫుడ్ పార్శిల్‌తో లిఫ్ట్ ఎక్కుతున్న ఫొటో విడుదల చేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ వాదనను అతడి తల్లిదండ్రులు తోసిపుచ్చారు. కచ్చితంగా ఇది హత్యేనని వాదించారు. మరణంపై దర్యాప్తు చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని.. భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని ఇటీవల పోలీసులు కేసును కూడా క్లోజ్ చేసేశారు.
తాజాగా సుచిర్ బాలాజీకి చెందిన ఒక ఫొటోను తల్లి పూర్ణిమారావు విడుదల చేసింది. మరణానికి ముందు సీసీటీవీలో రికార్డైన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో బాలాజీ ఫుడ్ పార్శిల్ పట్టుకుని లిఫ్ట్ దగ్గర నిలబడిన దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలో బాలాజీలో ఎలాంటి ఆందోళన గానీ.. ఆత్మహత్య చేసుకునే టెన్షన్ గానీ అతడిలో ఎక్కడా కనిపించలేదు. నార్మల్‌గానే కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ ఒక్క లిఫ్ట్ దగ్గరే సీసీ కెమెరా పని చేస్తోందని.. మిగతా చోట్ల సీసీకెమెరాలు సరిగ్గా పని చేయడం లేదని తెలుస్తోంది. అందుకే మిగతా ఎక్కడా కూడా బాలాజీ కనిపించలేదు. దీంతో తల్లి పూర్ణిమారావు మరింత అనుమానాలు రేకెత్తించారు. సుచిర్ చనిపోయిన రోజు రాత్రి 7:30 గంటల సమయంలో రికార్డైన ఫొటో అని తెలిపారు. అతడు చనిపోయిన 3 రోజుల తర్వాత నిర్వహించిన శవపరీక్షలో డ్రగ్ మోతాదు ఎక్కువగా ఉందని తెలిపారని.. కానీ తాము చేయించిన రిపోర్టులో మాత్రం అది తప్పని తేలిందని చెప్పారు. దీనిపై టాక్సికాలజిస్ట్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పూర్ణిమారావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అతడు నివసించే అపార్టుమెంటు గ్యారేజీలో, ఎలివేటర్‌లో ఎలాంటి సీసీటీవీలు లేవని, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా అవి పనిచేయడం లేదని ఆమె తెలిపారు.
Also Read
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
- August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
ఇది కూడా చదవండి: Virat Kohli: ఆ 14 ఏళ్ల అమ్మాయి కోహ్లీ కారణంగానే చనిపోయిందా?.. అసలు నిజం ఏంటంటే?
సుచిర్ బాలాజీ… చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’లో ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఓపెన్ ఏఐ సమాజానికి హానికరం అంటూ తీవ్ర విమర్శలు చేసి తప్పుకున్నారు. అందులోంచి బయటకు వచ్చిన కొంత కాలానికే నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో బాలాజీ విగతజీవిగా మారిపోయాడు. హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే పోలీసులు.. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చి చేతులు దులుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: భాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్‌లో కీలక మార్పు
సుచిర్ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. గత ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఓపెన్ ఏఐతో లాభం కంటే.. హానికరమే ఎక్కువ అని ఆరోపించాడు. అంతేకాకుండా చాట్‌జీపీటీ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించాడు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక పిటిషన్లు ‘ఓపెన్‌ఏఐ’పై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో అతడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.
Suchir’s picture on the day of his death at 7.30 pm , getting dinner. This is from CCTV footage.
OCME saw this video and still concluded he was depressed and called it suicide.
Another cover by OCME: they stated to our attorney that GHB is endogenous 3 days after death. But… pic.twitter.com/HwmZWhnt88
— Poornima Rao (@RaoPoornima) March 12, 2025
తాజావార్తలు
-
Nepal Gorkhas: “మేము భారత సైన్యంలో చేరుతాం”.. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
-
AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
-
CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
ట్రెండింగ్
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!