ఇరుగుపొరుగు అన్నాక.. సహజంగానే గొడవలు ఉంటాయి. మాటలు లేనప్పుడు చాలా మంది శుభకార్యాలకు పిలవరు. ఇక పిలవడం.. పిలవకపోవడం అనేది నిర్వాహకుల ఇష్టం. కానీ ఒక వ్యక్తి మాత్రం పగ పెట్టుకున్నాడు. పెళ్లికి ఇందుకు పిలవలేదంటూ వరుడి తండ్రిపైనే పొరుగింటి వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: #SSMB29 : ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక సినిమా రావడం నా లైఫ్‌లో చూడలేదు : కీరవాణి
గాజియాబాద్‌లోని మండోలా ప్రాంతంలో నివాసం ఉంటున్న సోను అనే వ్యక్తి కుమారుడి పెళ్లి ఈనెల 22న(శనివారం) జరగనుంది. పెళ్లి వేడుకలో భాగంగా గురువారం హల్దీ వేడుక నిర్వహించారు. అయితే పొరుగింటిలో ఉంటున్న వాల్మీకి అనే వ్యక్తి మద్యం మత్తులో పెళ్లి వాళ్లతో గొడవ పెట్టుకున్నాడు. పెళ్లికి ఎందుకు పిలవలేదని వాగ్వాదం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా నాటు తుపాకీతో వరుడు తండ్రి సోనుపై కాల్పులకు తెగబడ్డాడు. ఎడమ చేతిలోకి బుల్లెట్ దిగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. నిందితుడు వాల్మీకి ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉంటాడని.. పెళ్లికి వచ్చి గొడవ చేస్తాడన్న ఉద్దేశంతోనే పెళ్లికి పిలవలేదని వరుడు వెల్లడించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఏసీపీ సిద్దార్థ్ గౌతమ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Tirumala Rush: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారిమెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
నిందితుడికి తుపాకీ ఎలా వచ్చింది? దానికి లైసెన్స్ ఉందా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నిందితుడికి సహకరించిన తరుణ్ అనే వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే వరుడు-నిందితుడి మధ్య స్నేహం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనను పెళ్లికి ఎందుకు పిలవలేదన్న కోపంతోనే కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderbad: అల్వాల్ లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్… ఓయో రూంకి తీసుకెళ్ళి..