దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా దేశం ఏర్పడిందని తెలిపారు. భారత సమాఖ్యను కాపాడటానికి ఇది ముఖ్యమైన రోజు అని.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డీలిమిటేషన్ సొంత దేశంలో వారిని శక్తిహీనులుగా చేస్తుందన్నారు. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఇది సంఖ్యల గురించి కాదు.. ఇది అధికారం గురించి అని పేర్కొన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని.. అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మనం ఐక్యంగా ఉన్నామని.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్నిర్మాణం ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా స్టాలిన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఇది కూడా చదవండి: Aaron Finch: విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు..
ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, టీఆర్ఎస్ తరపున కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. ఇక కేరళ నుంచి ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హాజరయ్యారు. ఏపీ నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గైర్హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Drugs: ఏపీలో ఉగ్రవాదులు ఉపయోగించే డ్రగ్స్.. అధికారులు షాక్