హర్యానా-పంజాబ్ శంభు సరిహద్దులో ఉద్రిక్త చోటుచేసుకుంది. వివిధ డిమాండ్లతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి హర్యానా పోలీసులు.. రైతుల ఆందోళనను భగ్నం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేశారు. అనంతరం కాంక్రీట్ బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించారు.
భారత సంతతి విద్యార్థిని సుదీక్ష (20) మిస్సింగ్‌పై ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని అధికారులను కోరారు. మీడియా సమావేశంలో లేఖను చూపించారు. ఈ సందర్భంగా సుదీక్ష ఎక్కి ఎక్కి ఏడ్చేసింది.
దేశంలో ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుడైన బీజేపీ ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్లు ఉన్నాయని.. అత్యంత పేద బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు కేవలం రూ.1,700లే అని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ విశ్లేషణ చేసి నివేదిక విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారి మోహిందర్ సింగ్, అతని భార్య దిల్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. దంపతుల నివాసానికి సమీపంలోనే ఇద్దరు కుమారులు, కుమార్తె నివాసం ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడ జేపీ నడ్డాతో బిల్‌గేట్స్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
టెస్లా కార్ల సంస్థకు అమెరికాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌కి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
శశిథరూర్.. కాంగ్రెస్ ఎంపీ. కానీ పొగడ్తలు మాత్రం కేంద్రంపై ఉంటాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఒక్క కామెంట్ ఉంటుంది. తరచుగా ప్రధాని మోడీని, కేంద్ర పెద్దలను ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో ఆయన కాంగ్రెస్ వీడనున్నట్లు వార్తలు వినిపించాయి.
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా రన్యారావుతో తెలుగు నటుడు తరుణ్ రాజుకు ఉన్న సంబంధాల గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఇరువర్గాల వాదనల్లో కొత్త విషయాలు బయటకొచ్చాయి.