ఐర్లాండ్ అధ్యక్ష పదవి కోసం యూఎఫ్‌సీ ఫైటర్ కోనర్ మెక్‌గ్రెగర్ (36) బరిలోకి దిగారు. ఈ మేరకు గురువారం ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల కోసం తన పేరును నమోదు చేసుకున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మెక్‌గ్రెగర్ కలిశారు. అనంతరం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రత, వలసలకు కళ్లెం వేయాలని కోనర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ప్రచారం చేనున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Gautam : యాక్టింగ్‌తో అదరగొట్టిన మహేశ్ కొడుకు గౌతమ్.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే ఎలోన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ నుంచి సంపూర్ణ మద్దతు లభించాకే మెక్‌గ్రెగర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐర్లాండ్ రక్షణ తన వల్లే సాధ్యమని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మస్క్, ట్రంప్ మద్దతుతో రాజకీయాల్లో రాణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మెక్‌గ్రెగర్ అధ్యక్ష బరిలోకి దిగడం సాధ్యమా? కాదా? అన్న సందిగ్ధం నెలకొంది. అధ్యక్షుడిగా నిలబడాలంటే పార్లమెంట్ నుంచి 20 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఈ ప్రకారంగా ఆయనకు మద్దతు ఉంటుందా? లేదా? అని తేలాలి.
ఇది కూడా చదవండి: Manish Sisodia: మనీష్ సిసోడియాకు ప్రమోషన్.. పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియామకం