మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ భవన్‌ను సందర్శించారు. అనంతరం ఏపీ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా సచిన్ టెండూల్కర్‌తో ఉన్న ఒక వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
చట్టం తెలిసివాళ్లే.. చట్టాన్ని మీరితే ఇంకేమీ న్యాయం జరుగుతుంది. ఉన్నతమైన స్థానంలో కూర్చుని తీర్పులు చెప్పే న్యాయమూర్తులే గాడి తప్పుతున్నారు. న్యాయశాఖకే మచ్చ తెచ్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హత్యకు గురైన మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన విషయాలను పోలీసులు మీడియాతో పంచుకున్నారు. చేతబడి, నగదు బదిలీలపై కీలక విషయాలను పంచుకున్నారు. సౌరబ్ భార్య ముస్కాన్ డ్రగ్స్, మద్యానికి బానిసై అయినట్లుగా తెలిపారు.
లండన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వందలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రూ విమానాశ్రయాన్ని మూసివేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టు పని చేయదని అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది
హమాస్‌తో సంబంధాలు ఉన్నాయంటూ భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిని అరెస్ట్ చేసి బహిష్కరించింది. అయితే ఈ బహిష్కరణను వర్జీనియా కోర్టు అడ్డుకుంది. తదుపరి ఉత్వర్వులు ఇచ్చేంత వరక బహిష్కరణపై నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఒకప్పుడు పెళ్లంటే చాలా సింపుల్‌గా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బు పెరిగింది. ఆలోచన మారింది. ఒకరి కంటే గొప్పగా వేడుక చేసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని గ్రాండ్‌గా చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీని పేరుతో కొత్త కొత్త ట్రెండ్లు సృష్టిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కేంద్రం-తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది. హిందీ, డీలిమిటేషన్‌పై డీఎంకే పోరాటం చేస్తోంది. ఈ ఉద్యమాన్ని డీఎంకే జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తోంది.
వామ్మో.. ఆడోళ్లు ఎంతకు బరి తెగిస్తున్నారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నారని.. కట్టుకున్నవాళ్లనే కాటికి పంపించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే జైపూర్‌లో మరో హత్య కలవరం పుట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఎదురుగాల్పులు జరుగుతున్నాయి.