దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్ టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు పరీక్షల కాలం ముగియతుండడం.. ఇంకోవైపు సమ్మర్ కావడంతో చల్లదనం కోసం ఊటీకి వెళ్తున్నారు. అయితే అక్కడ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలియక వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: YCP vs Janasena: వైసీపీ వర్సెస్ జనసేన..! నిడదవోలులో ఉత్కంఠ పరిస్థితి..
ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటక వాహనాలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ అధికారులు ఆంక్షలు విధించారు. మంగళవారం నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక సహా స్థానిక పర్యాటకుల వాహనాలు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. అయితే ఈ-పాస్ ఆంక్షలు తెలియక పోవడంతో వేలాది వాహనాలు వేచి ఉన్నాయి. రోజుకు 4000 వాహనాలకు మాత్రమే ఊటీ, కోడైకెనాల్‌లోకి అనుమతి ఇస్తున్నారు. శని, ఆదివారాల్లో అయితే 6 వేల పర్యాటక వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. కొత్తగా పెట్టిన ఈ-పాస్ రూల్స్ తెలియక తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఊహించని స్థాయిలో పర్యాటకులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏం చేయాలో తెలియక అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని టూరిస్టులు డిమాండ్ చేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో జిల్లా అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: TTD : ఏప్రిల్ 5 నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు