పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఆమె ఒక విద్యావంతురాలు. అంతేకాదు. ఒక స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలని అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. విద్యార్థి తండ్రితో ఎఫైర్ పెట్టుకుంది. అనంతరం బ్లాక్ మెయిల్‌కి దిగింది. రూ.లక్షల్లో డబ్బులు గుంజుంది. మరింత డబ్బు కోసం నీచానికి ఒడిగట్టింది. చివరికి పాపం పండి కటకటాల పాలైంది.
పోలీసుల కథనం ప్రకారం… 2023లో పశ్చిమ బెంగళూరు పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యాపారి తన భార్య, ముగ్గురు కుమార్తెలు, ఐదేళ్ల కొడుకును తీసుకుని ప్రీ-స్కూల్‌కు తీసుకెళ్లి చేరిపించారు. అడ్మిసన్ సమయంలో శ్రీదేవి రుడగి (25) అనే టీచర్… వ్యాపారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంది. అతడితో రోజు ఫోన్ మాట్లాడుతూ ప్రారంభించింది. అంతేకాకుండా మొబైల్ నెంబర్లు మార్చి.. ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టారు. సందేశాలు, వీడియో కాల్స్ చేసుకోవడం జరుగుతోంది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారి నుంచి రూ.4లక్షలు బలవంతంగా శ్రీదేవి తీసుకుంది. జనవరిలో మరో రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు అతడు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ పరిణామంలోనే రూ.50వేలు అప్పుగా తీసుకునేందుకు నేరుగా వ్యాపారికి ఇంటికి వెళ్లింది. ఇక టీచర్ శ్రీదేవి టార్చర్ భరించలేక.. కుటుంబాన్ని గుజరాత్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు.
అయితే పిల్లల బదిలీ సర్టిఫికేట్ కోసమని మార్చి నెల ప్రారంభంలో వ్యాపారి స్కూల్‌కు వెళ్లాడు. నేరుగా శ్రీదేవి కార్యాలయంలోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న గణేష్ కాలే (38), సాగర్ (28) బెదిరింపులకు దిగారు. శ్రీదేవితో వ్యాపారి కలిసి ఉన్న ప్రైవేటు ఫొటోలను చూపించి బెదిరింపులకు దిగారు. రూ.20లక్షల ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని టార్చర్ పెట్టారు. చేసేదేమీలేక రూ.15లక్షలు ఇచ్చేందుకు చర్చలు జరిపాడు. వెంటనే రూ.1.9లక్షలు బదిలీ చేశాడు. మిగతావి ఇవ్వాలంటూ మార్చి 17న శ్రీదేవి ఫోన్ చేసింది. మాజీ పోలీస్ అధికారికి రూ.5లక్షలు, సాగర్, కాలేకు రూ.లక్ష చొప్పున.. శ్రీదేవికి రూ.8లక్షలు పంపించాడు. ఇక ప్రాణం విసిగిన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీచర్ శ్రీదేవితో పాటు సాగర్, కాలేలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.