ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.
సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు చిన్న చిన్న కారణాలకే దెబ్బతింటున్నాయి. కారణాలు ఏమైనా సరే కల కాలం కలిసి జీవించాల్సిన వాళ్లు అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు.
రాజ్యసభలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ బీజేపీ అనురాగ్ ఠాకూర్‌పై విరుచుకుపడ్డారు.
ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల పర్యటన కోసం గురువారం బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగగానే మోడీకి ఘనస్వాగతం లభించింది. థాయ్‌లాండ్ అధికారులతో పాటు భారతీయులు భారీ స్వాగతం పలికారు.
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. గురువారం రాజ్యసభలోకి వెళ్లే ముందు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు.
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక ఇదే బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శిక్షణలో ఉన్న ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చనిపోగా.. మరొక పైలట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జామ్‌నగర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సువార్త గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే స్థానిక ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో మీడియా సమావేశంలో సుంకాలు వెల్లడించారు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.