మలేషియాలో భారీ విస్ఫోటనం సంభవించింది. పుత్రా హైట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రాజధాని కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్‌లో మంగళవారం ఉదయం గ్యాస్ పైప్‌లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అయితే పేలుడి ధాటికి సమీప ఇళ్లులు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. గోడలు పగిలిపోయాయి. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. సమీప నివాసాలను ఖాళీ చేయిస్తు్న్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేంద్ర అనుమతి లేకుండా చెట్లు నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పు..
దాదాపు కిలోమీటర్ వరకు మంటలు ఎగిసిపడుతున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్రస్తుతం సమీపంలోని నివాస ప్రాంతాలను ఖాళీ చేయమని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోవడం వల్లే ఈ విస్ఫోటనం జరిగిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాణ నష్టం గురించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే ప్రమాద సమయంలో చాలా ఇళ్లులు దగ్ధమయ్యాయని.. అనేక మంది గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Huge fire breaks out at petrol station in Putra Heights, Malaysia; no word on casualties. pic.twitter.com/qCxssfLtcg
— AZ Intel (@AZ_Intel_) April 1, 2025
Petronas Putra Heights Avenue 🔥#petronas #fire Can be seen in front of my housing area. pic.twitter.com/nY6zA8W9u2
— white island 🕊️🫒🌲 (@fizasyaza) April 1, 2025
Video: House severely damaged from gas pipeline explosion and fire in Putra Heights, Malaysia.
https://t.co/rh68HCo3nG— AZ Intel (@AZ_Intel_) April 1, 2025
WATCH: Massive explosion at gas pipeline near Malaysia's capital pic.twitter.com/7BATt2L7sT
— BNO News Live (@BNODesk) April 1, 2025