సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా పరువు నష్టం కేసులో విధించిన శిక్షను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా మేధా పాట్కర్ కోర్టు హాల్‌లో లేనందున అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ శిక్ష ప్రకటనను వాయిదా వేశారు. ఏప్రిల్ 8న తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం మేధా పాట్కర్‌కు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీకి తరలింపు!
ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని ఎన్జీవోకు నేతృత్వం వహించారు. అయితే వీకే.సక్సేనా గుజరాత్ ప్రజలను.. వారి వనరులను విదేశీ ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటూ మేధా పాట్కర్ ఆరోపించారు. అంతేకాకండా పత్రికా ప్రకటన ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమెపై వీకే.సక్సేనా పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో గతేడాది మే 30న వాదనలు పూర్తయ్యాయి. ఇక శిక్షపై తీర్పును జూన్ 7కు రిజర్వ్ చేసింది. మొత్తానికి జూలై 1, 2024న ఆమెకు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ మేధా పాట్కర్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఇక్కడ కూడా ఆమెకు తాజాగా చుక్కెదురైంది. ఏప్రిల్ 8న సెషన్స్ కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Unity Drive: హైదరాబాద్ నుంచి స్పితి వరకు యాత్ర.. ఇది సమాజాన్ని మార్చే ఉద్యమం