ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఈ కేసులో సిద్ధరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు నివేదికను ఈడీ సవాల్ చేసింది. లోకాయుక్త నివేదికను కొట్టివేయాలంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముడా కేసులో సిద్ధరామయ్య హస్తం ఉందనడానికి తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని.. తాము బాధితుల పక్షమని ఈడీ కోర్టుకు తెలిపింది. ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందని చెప్పడానికి ఆధారాలు ఇస్తామని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య నిర్దోషి అని ప్రకటించడం తప్పు అని పిటిషన్‌లో ఈడీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అఖిలేష్ యాదవ్ ప్రశ్నకు అమిత్ షా ఫన్నీ సమాధానం.. నవ్వులే నవ్వులు(వీడియో)
ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతించారు. అప్పట్లో ఈ నిర్ణయం పెను సంచలనం అయింది. ఇక ఈ కేసులో లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి సిద్ధరామయ్యను నిర్దోషిగా లోకాయుక్త తేల్చి నివేదిక ఇచ్చింది. తాజాగా లోకాయుక్త నివేదికను ఈడీ సవాల్ చేసింది.
ఇది కూడా చదవండి: Niharika : మరో సినిమా నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల.. హీరోగా సంగీత్ శోభన్