వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక బిల్లు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే చట్టంగా మారనుంది. బిల్లు చట్టంగా మారకముందే సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అంతేకాకుండా విదేశీయులకు జన్మతహ పౌరసత్వాన్ని రద్దు చేశారు. వీసాలకు బ్రేక్ వేశారు. కానీ ఆ మధ్య ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరొక పైలట్ గాయాలతో బయటపడ్డాడు.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే కానరాకుండా పోతున్నారు. ఈ మధ్య చావులు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇది కీలక పరిణామం అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మొత్తానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి వంతు వచ్చింది. ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది.
బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్‌లో పట్టపగలు మేఘాలు కమ్ముకున్నాయి. నగరమంతా చీకటి అలుముకుంది. ఇక నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములు, గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు ప్రమాదం తప్పింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫొటోలకు పోజులిచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఇందులో భాగంగా నిర్వాహకులతో కలిసి ఫొటోలు దిగేందుకు స్టేజ్ చివరి నుంచి రావడంతో ఒక్కసారిగా అమాంతంగా కిందపడిపోయారు.