ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందిపర్చాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటన చేయడానికి ఇష్టం లేకపోతే.. కచ్చితంగా వైబ్‌సైట్‌లోనైనా వెల్లడించాలని తెలిపింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. యశ్వంత్ వర్మ నివాసంలో డబ్బుల కట్టలు దొరకడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: NANI : HIT – 3 లో కోలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్
న్యాయపరమైన పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు ఉన్నారు. వీరంతా ఆస్తుల వివరాలు వెల్లడించాలని తెలిపింది. ఈ నిర్ణయం భవిష్యత్‌లో వచ్చే న్యాయమూర్తులకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1997 తీర్మానం ప్రకారం.. ఆస్తులను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉండేది. అయితే 2009 నిర్ణయం ప్రకారం కోర్టు వెబ్‌సైట్‌లో స్వచ్ఛందంగా వెల్లడించడానికి అనుమతి ఉన్నప్పటికీ న్యాయమూర్తుల మాత్రం అలా చేయడానికి ఇష్టపడలేదు. కానీ తాజా నిర్ణయంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా సమిష్టిగా ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జవాబుదారీతనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆస్తుల వివరాలు సీజేఐకే ఇవ్వకపోయినా.. పబ్లిక్‌గా కూడా ప్రకటించుకునే అధికారం ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు ఆస్తులు వివరాలు ప్రకటించారు. ఇందులో న్యాయమూర్తుల్లో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఉన్నారు.
ఇది కూడా చదవండి: NANI : HIT – 3 లో కోలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్