ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పీరియడ్స్ కారణంగా నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండి.. దుర్గాదేవిని పూజించలేకపోయానన్న మనస్తాపంతో 36 ఏళ్ల ప్రియాంషా సోని
బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హడలెత్తించిన ధరలు.. రెండు రోజులుగా ఊరట కలిగిస్తున్నాయి. శనివారం కూడా భారీగానే ధరలు తగ్గాయి. దీంతో శుభకార్యాలు దగ్గర పడడంతో గోల్డ్ కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రధాని మోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీలంక చేరుకున్నారు. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే స్వాగతం పలికారు.
కెనడాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఒట్టావాలో భారతీయుడిని దుండగుడు కత్తితో పొడిచి చంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యంత అధునాతన ప్రమాదకరమైన అమెరికాకు చెందిన బీ-2 బాంబర్ విమానాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి. ప్రస్తుతం ఇలాంటివి అమెరికా దగ్గర 20 ఉన్నాయి. వీటిలో ఆరు విమానాలను ఇండో-పసిఫిక్‌కు తరలించింది.
ఆగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. తామేమీ తక్కువ కాదని నిరూపించింది. తాము కూడా తగ్గేదేలే అన్నట్టుగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ పంపిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు షాక్ తగిలింది. అవినీతి కేసులో కుమార్తె టి.వీణను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్‌లో అవకతవకలు జరగడంలో వీణ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్‌ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.