ఆగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. తామేమీ తక్కువ కాదని నిరూపించింది. తాము కూడా తగ్గేదేలే అన్నట్టుగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Allagadda: ఎస్ఐ వేధింపులు భరించలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా భయపడిందని.. తప్పుడు నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. వాళ్లకు మరొక మార్గం లేదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
అమెరికా విధించిన సుంకాలను చైనా తీవ్రంగా తప్పుపట్టింది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అమెరికా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా పేర్కొంది.
అమెరికా విధించిన సుంకాలపై పలు దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. స్నేహం చేస్తూనే.. మిత్ర దేశాలపై ఇలా సుంకాలు విధించడం సరైంది కాదని ఆయా దేశాలు పరోక్షంగా నిరసన వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: Visakhapatnam: విశాఖలో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్!