రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నహర్‌గఢ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఎస్యూవీ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. 80 కి.మీ వేగంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా.. మరో తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారు.
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా(64)కు మరోసారి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు కొట్టేసింది. తాజాగా మరోసారి తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించింది.
అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీహార్ ప్రభుత్వం పారిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. సుప్రీం ధర్మాసనం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి అన్నాక అనేక ఆచారాలు, సంప్రదాయాలు, సరాదాలు, ఆటాపాటా.. ఇలా ఒక్కటేంటి? అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇక నూతన దంపతుల్ని స్నేహితులు గానీ.. బంధువులు గానీ ఆట పట్టించే కార్యక్రమాలు.. ఇలా వగేరా ఉంటాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్‌లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్‌నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముంబై పోలీసులు ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేశారు. కానీ పోలీసుల విచారణకు మాత్రం కునాల్ హాజరు కాలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడుతూ.. ఆ రెండు దేశాలు యుద్ధం ఆపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు పదే పదే బాంబులు వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కొద్దిరోజులుగా ‘‘పలయన్ రోకో, నౌక్రీ దో’’ (వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి) పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.