ప్రధాని మోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీలంక చేరుకున్నారు. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే స్వాగతం పలికారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్‌టెక్ శిఖరాగ్ర ససమావేశానికి మోడీ హాజరయ్యారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు శ్రీలంకలో మోడీ పర్యటించనున్నారు.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో భారతీయుడు హత్య.. నిందితుడు అరెస్ట్
శ్రీలంక పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, రక్షణ రంగం, అలాగు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించనున్నారు. శనివారం అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో ప్రధాని మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు.
రెండేళ్ల క్రితం శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఆ సమయంలో భారత్ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీలంక నెమ్మది.. నెమ్మదిగా తేరుకుంటోంది. తాజాగా మోడీ పర్యటనతో శ్రీలంకకు మరింత మేలు చేకూరే పరిస్థితులు కనిపిస్తు్న్నాయి.
#WATCH | PM Narendra Modi was received by Sri Lankan President Anura Kumara Dissanayake at Independence Square in Colombo during his three-day visit to Sri Lanka, which began yesterday.
(Source – ANI/DD) pic.twitter.com/Nsbbe4rw6d
— ANI (@ANI) April 5, 2025
#WATCH | PM Narendra Modi received a ceremonial Guard of Honour in Colombo at the Independence Square.
PM Modi is on a three-day visit to Sri Lanka, which began yesterday after he attended the BIMSTEC Summit in Bangkok.
(Source – ANI/DD) pic.twitter.com/GZaBnwhQ1l
— ANI (@ANI) April 5, 2025