బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హడలెత్తించిన ధరలు.. రెండు రోజులుగా ఊరట కలిగిస్తున్నాయి. శనివారం కూడా భారీగానే ధరలు తగ్గాయి. దీంతో శుభకార్యాలు దగ్గర పడడంతో గోల్డ్ కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: SSMB : పండుగాడి పాస్ పోర్ట్ తిరిగొచ్చింది..
బులియన్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.900 తగ్గి.. రూ.83,100గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గి.. రూ.90,660గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగానే ఊరటనిస్తున్నాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. నేడు రూ.5,000 తగ్గి.. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.94,000గా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Ministers: “2000 ఎకరాల్లో ఎకో పార్క్”.. కంచ గచ్చిబౌలి భూములపై మంత్రులు కీలక ప్రతిపాదన..