గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. మంగళవారం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. నేటి సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ సంబోధించిన కేసులో కునాల్ కమ్రాకు న్యాయస్థానం రక్షణ కల్పించింది.
బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనంటూ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నతమైన స్థాయిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని పలువురు మహిళలు నిలదీశారు.
తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పు పడుతూ.. 10కిపైగా బిల్లులను ఆమోదిస్తున్నట్లు మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎంకే.స్టాలిన్ స్పందించారు.
మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ ఎండి ఎ రాజీ.. ఉజ్బెకిస్తాన్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో హుటాహుటినా హోటల్ సిబ్బంది గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది.
చైనాపై ట్రంప్ విధించిన సుంకాలను టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మనసు మార్చుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం సరికొత్త కళ సంతరించుకుంది. ట్రంప్ సుంకాలతో సోమవారం ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా మారింది. కానీ కొన్ని గంటల్లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.