మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ ఎండీ ఎ రాజీ.. ఉజ్బెకిస్తాన్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో హుటాహుటినా హోటల్ సిబ్బంది గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మృతిపై ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భార్య.. ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారాకు వెళుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే రాజీ గుండెపోటుతో చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన మరణంపై దర్యాప్తు కొనసాగుతోందని సంగ్మా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Balabhadrapuram Cancer Cases: ఎమ్మెల్యే నల్లమిల్లి అత్యుత్సాహమే బలభద్రపురానికి శాపం..! క్యాన్సర్‌పై తప్పుడు ప్రచారం..!
రాజీ.. మధ్య ఆసియా దేశానికి ప్రైవేటు పర్యటన కోసం వెళ్లారు. 2021 నుంచి మేఘాలయలో డిప్యుటేషన్‌పై ఐఆర్‌టీఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ఏప్రిల్ 4 నుంచి బుఖారా నగరంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం హోటల్ గదిలో మృతదేహం కనిపించిందని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. గుండెపోటుతో మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
Deeply pained to hear about the untimely demise of Syed Md. A. Razi, IRTS, Principal Secretary, GoM
Razi’s incredible efficiency and unwavering dedication were evident in every department he handled, and he always took on each task with a level of ownership that inspired those… pic.twitter.com/YJolnGcqEC
— Conrad K Sangma (@SangmaConrad) April 7, 2025