పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ముర్షిదాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి.. పోలీస్ వాహనాలు తగలబెట్టారు.
ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం పలికారు. మే 9న మాస్కోలో జరగనున్న విక్టరీ డే వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న ఈ విక్టరీ వేడుకలు జరుగుతుంటాయి. 8
ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. రూ. 63,000 కోట్లతో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందంతో భారత నావికాదళానికి 22 సింగిల్-సీటర్, నాలుగు ట్విన్-సీటర్ విమానాలు రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులకు పవర్స్ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఏఐసీసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
ఆన్లైన్ ప్రేమికుడి కోసం అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి ఖండాంతరాలు దాటుకుని భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హాయ్’ అనే పలకరింపుతో మొదలైన స్నేహం.. చివరికి పెళ్లిపీటల దాకా వెళ్లింది. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ.
ఈశాన్య తైవాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది. తైవాన్ రాజధాని తైపీలో పలు భవనాలు ప్రకంపనలకు గురయ్యాయి. కొన్ని సెకన్ల పాటు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ తీవ్రంగా అతలాకుతలం అయిపోతున్నాయి. తాజాగా చైనా మీదైతే ఏకంగా 104 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించారు. దీంతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికాలో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్‌కు అప్పగించొద్దంటూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి కుమారి అనంతన్ (93) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున చెన్నైలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో అనంతన్ ప్రాణాలు వదిలారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.