మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
గాజా-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిశాక పరిస్థితులు మళ్లీ చేజారాయి. హమాస్ అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మత యుద్ధాలను ప్రేరేపిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరింత తీవ్రమైంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 90 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.