ప్రస్తుతంలో ఏపీలో నియంతృత్వ పాలనను చూస్తున్నామని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సజ్జల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విశాఖలో బలం లేకపోయినా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారని మండిపడ్డారు. ఒక బీసీ మహిళ మేయర్‌గా ఉన్న చోట పదవి నుంచి తప్పించారన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ అధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్ధను అడ్డుపెట్టుకుని బరితెగించి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Blue Drum: పెళ్లిలో వరుడికి గిఫ్ట్‌గా ‘‘బ్లూ డ్రమ్’’.. ఒక్కసారిగా అంతా షాక్..
స్వాతంత్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేసినట్లు చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు ఎవరైనా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా జగన్ పాలన ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం విషయంలో ముందడుగు వేశామన్నారు. తండ్రి వైఎస్సార్ ఆశయాలను సాధించేందుకు అగ్నిపరీక్షలన్నీ జగన్ ఎదుర్కొన్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం జగన్ కృషి చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో సమాజంలో అణగారిన వర్గాలకు అనేక అవకాశాలు దక్కాయని గుర్తుచేశారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం అని.. అధికారంలోకి రాగానే దోచుకోవడం మొదలు పెట్టారన్నారు.
ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో అరగేట్రం చేసిన 14 ఏళ్ల పిన్న వయస్కుడు.. రాణిస్తాడా?