MP: ఆస్పత్రిలో అమానుషం.. వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది. వైద్యులు సస్పెండ్
- మధ్యప్రదేశ్‌లో ఆస్పత్రిలో అమానుషం
- వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది
- ఇద్దరు వైద్యులు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ఏప్రిల్ 17న నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (77).. భార్య వైద్య పరీక్షల కోసం ఛతర్‌పూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు వ్యక్తులు.. జోషిని లాక్కెళ్లారు. టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో ఉన్నానని.. తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టాడని జోషి ఆరోపించాడు. అప్పటికే ఆ స్థలం రద్దీగా ఉందని.. క్యూలో నిలబడే విషయంలో డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్
ఘటనపై క్లారిటీ రాలేదు గానీ.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిశ్రా, అహిర్వార్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య సేవల నుంచి మిశ్రాను తొలగించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకు సబార్డినేట్లను నియంత్రించడంలో విఫలమైనందుకు అహిర్వార్‌ను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ ఆదేశాలను కూడా అహిర్వర్ విస్మరించారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడం వేటు పడింది. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాలని కలెక్టర్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
ఇదిలా ఉంటే వృద్ధుడిని ఈడ్చికెళ్లిన ఘటనలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో మిశ్రాపై ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను ఛతర్‌పూర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.
• 75 साल के बुजुर्ग को #छतरपुर जिला अस्पताल के डॉक्टर्स और अस्पताल स्टाफ द्वारा न सिर्फ लात-घूंसे मारे गए, बल्कि बेरहमी से घसीटकर अस्पताल से बाहर फेंक दिया गया!
• पत्नी के इलाज के लिए आए बुजुर्ग का कसूर सिर्फ इतना था कि वे लंबी लाइन में लंबे वक्त तक खड़े नहीं हो पा रहे थे,… pic.twitter.com/VAB1MeMb1s
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) April 20, 2025
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!