ప్రధాని మోడీ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కాసేపట్లో మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మంగళవారం జెడ్డా వెళ్లారు. వాస్తవానికి తిరిగి బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి.
పహల్గామ్ ఉగ్రదాడిని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు న్యాయస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ప్రమోషన్ దక్కింది. బీజేపీ అధిష్టానం వారిద్దరిని పెద్దల సభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంట్లో అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యారు. దాదాపు 10-15 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ విలవిలలాడి ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరులో వైమానిక దళ అధికారి బోస్, ఆయన భార్య మధుమితతో కలిసి కారులో వెళ్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి.
అమెరికాలోని ఓర్లాండో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సిద్దపడుతుండగా ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ప్రయాణికులను వెంటనే కిందకు దించేశారు.
అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్రేత్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త కార్యదర్శి కోసం వైట్‌హౌస్ వెతుకులాట ప్రారంభించిందని వార్తలు ప్రకారం అవుతున్నాయి.
జమిలిపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది.