ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Samantha: డేట్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకి సమంత?
ఇదిలా ఉంటే అమెరికాతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో సుంకాలపై ట్రంప్‌తో మోడీ చర్చలు కూడా జరిపారు. ఇరువురి మధ్య సానుకూల వాతావరణం నెలకొన్నట్లుగా ఆ మధ్య ప్రెస్‌మీట్‌లో ట్రంప్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈనెల 23న ఇదే అంశంపై ఇరు దేశాలు చర్చించనున్నారు. దాదాపు 19 ఒప్పందాలకు సంబంధించిన అంశలపై నిబంధనలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి వాషింగ్టన్‌తో భారత్ చర్చలు ఉంటాయని వర్గాలు పేర్కొన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యా్ని 500 బిలియన్లకు పెంచే ఆలోచనతో ఇరు దేశాలు ఉన్నట్లు సమాచారం. ఇరు దేశాల చర్చలు చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204
ఒప్పందంలో వస్తువుల వాణిజ్యం, సేవలు, పెట్టుబడులు, కస్టమ్స్ విధానాలు వంటి వివధ రంగాలకు సంబంధించి దాదాపు 19 విభాగాలు ఉండనున్నాయి. చర్చల కోసం భారత్ నుంచి సీనియర్ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఏప్రిల్ 23 నుంచి వాషింగ్టన్‌లో మూడు రోజుల వ్యక్తిగత వాణిజ్య చర్చలు ఉండనున్నాయి.
వాణిజ్య ఒప్పందంలో ఎలక్ట్రిక్ వాహనాలు, కొన్ని పారిశ్రామిక వస్తువులు, వైన్లు, పాడి, పెట్రోకెమికల్స్, ఆపిల్స్, అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెట్టు గింజలు వంటి ఉత్పత్తులకు అమెరికా సుంకాలు తగ్గించే ఛాన్సుంది. అలాగే భారతదేశం కూడా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, రసాయనాలు, ప్లాస్టిక్‌లు, రొయ్యలు, నూనెగింజలు, ఉద్యానవన ఉత్పత్తులు వంటి రంగాలకు రాయితీలు ఇవ్వాలని చూస్తోంది. మొత్తానికి చర్చలు సఫలీకృతం అవుతాయని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..