JD Vance: నేటి నుంచి 4 రోజులు భారత్‌లో జేడీ వాన్స్ ఫ్యామిలీ పర్యటన
- నేటి నుంచి 4 రోజులు భారత్‌లో జేడీ వాన్స్ ఫ్యామిలీ పర్యటన
- సోమవారం ప్రధాని మోడీతో జేడీ వాన్స్ సమావేశం
- సుంకాలు, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీకానున్నారు. ఈ సందర్భంగా సుంకాలపై ఇరువురు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా జేడీ వాన్స్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. జేడీ వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu : “నా మనసు ఉప్పొంగింది”.. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై స్పందించిన చంద్రబాబు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
సోమవారం ఉదయం 10 గంటలకు ఇటలీ నుంచి ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి జేడీ వాన్స్ భారత్‌కు చేరుకుంటారు. పాలం ఎయిర్‌బేస్‌లో సీనియర్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక స్వామి నారాయణ్ అక్షర్‌ధామ్‌కు వెళ్లనున్నారు.
ఇక సోమవారం సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. భేటీ అనంతరం ప్రధాని విందు ఇవ్వనున్నారు. వాన్స్ దంపతులతో పాటు అమెరికా అధికారులు హాజరు కానున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu : “నా మనసు ఉప్పొంగింది”.. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై స్పందించిన చంద్రబాబు..
ఇక మంగళవారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో వాన్స్ ప్రసంగించనున్నారు. 23వ తేదీ ఉదయం వాన్స్ దంపతులు, పిల్లలు ఆగ్రాకు వెళ్తారు. తాజ్ మహల్ తర్వాత జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు. ఇక జేడీ వాన్స్ రాక సందర్భంగా ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులకు ‘‘ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక’’.. కుల భేదాలు తొలగాలి..

తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?