ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు వెళ్లారు. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ సౌదీకి వెళ్తున్నారు.
మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. సిద్ధిఖినీని చంపినట్లుగానే చంపేస్తామంటూ మెయిల్ చేశారు.
అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ సర్కార్ ప్రత్యక్ష పోరాటానికి దిగింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార-ప్రతిపక్షాలు అధికారం కోసం వ్యూహాలు-ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించారు. టీవీకే (తమిళగ వెట్రి కళంగం) పార్టీ కూడా ఈసారి ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది.
అమెరికా.. ప్రపంచంలోనే అగ్ర రాజ్యం. ఇక రక్షణ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఎంతో పగడ్బందీగా.. రహస్యంగా ఉంటుంది. అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారం లీక్ కావడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.
అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు.
జార్ఖండ్ రాష్ట్ర కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తలలో బుల్లెట్ కనిపించింది. ఇక మృతదేహం పక్కన ఒక పిస్టల్ కనిపించింది. వినయ్ సింగ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం సోమవారం ఉదయం పాలం ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.