కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంట్లో అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యారు. దాదాపు 10-15 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ విలవిలలాడి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ రాక్షసుడిని చంపేశానంటూ పెద్ద పెద్దగా అరుస్తూ భార్య పల్లవి హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు ఒకింత భయాందోళనతో వణికిపోయారు. రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిలో గౌరవ, మర్యాదలు పొందిన వ్యక్తి ఆ విధంగా హత్యకు గురి కావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: Kollywood : అజిత్, విక్రమ్ బాకీ తీర్చారు.. ఇక సూర్య వంతు
ఇక ఈ కేసులో నిందితురాలు పల్లవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను ఎలా చంపాలన్న విషయంపై గత 5 రోజులుగా గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎక్కడ నరాలు తెగితే త్వరగా చనిపోతారో.. ఆ విషయాన్ని ఆమె శోధించినట్లుగా కనుగొన్నారు. హత్యలో భార్య పల్లవి, కుమార్తె కృతి ఉన్నారు. కానీ హత్య తానే చేశానంటూ పల్లవి నేరాన్ని అంగీకరించింది. దీంతో భార్యనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఇక సోమవారం పోలీసులు.. సంఘటనాస్థలికి తీసుకుని వెళ్లి విచారించారు. అయితే కృతి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఎయిర్‌ఫోర్స్ అధికారిపై దాడి నిజమెంత? వెలుగులోకి కొత్త ట్విస్ట్
పల్లవి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. దీంతో ఓం ప్రకాష్.. తన చెల్లెలు ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ప్రశాంతత లేకపోవడంతో అక్కడే ఉంటున్నారు. ఇక ఆయనకు సంబంధించిన 15 ఎకరాల పొలం కూడా సోదరికే రాస్తానని ఓం ప్రకాష్ అనడంతో భార్య, కుమార్తెలో కోపం రగిలించింది. అయితే కుమార్తె ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది. అయితే అతడి హత్యకు ముందుగానే పథకం రచించడంతో మళ్లీ గొడవలు ఎక్కువయ్యాయి. ఆదివారం ఓం ప్రకాష్ భోజనం చేస్తుండగా మరోసారి గొడవలు చెలరేగడంతో కోపం పట్టలేక.. భార్య పల్లవి కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచి చంపేసింది. శరీరమంతా విచక్షణా రహితంగా పొడిచేసింది. రక్షించాలంటూ మొర పెట్టుకున్నా.. ఏ మాత్రం కనికరం చూపించకుండా ప్రాణం పోయేంత వరకూ చూస్తూనే ఉన్నారు. అనంతరం పోలీసులకు ఆమెనే ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు సాగుతోంది.
ఇది కూడా చదవండి: MLA Sanjeeva Reddy: “మా ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదు”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆడియో..