కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పార్లమెంట్ అనెక్స్‌లో ఈ భేటీ జరగనుంది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను కేంద్ర పెద్దలు.. నేతలకు వివరించనున్నారు.
పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
పహల్గామ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చారు. హర్యానాలోని కర్నాల్‌లో వినయ్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ ఖట్టర్ కళ్లు చెమర్చాయి.
ఛత్తీస్గడ్-తెలంగాణ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 20 వేల మంది భద్రతా దళాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం.
పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు.
పహల్గామ్లో ఉగ్రమూకల చేతిలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ ప్రాణాలు కోల్పోయాడు. భార్య, కుమారుడి ముందే ముష్కరులు ప్రాణాలు తీశారు. మంజునాథ్ భౌతికకాయం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
పహల్గామ్ మారణహోమం.. ఎన్నో కుటుంబాల్లో చీకటి మిగిల్చింది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన ఒక్కో విషాదగాధ వెలుగులోకి వస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు.. కుటుంబాలకు ఆధారమైన ఎందరో భాగస్వాములను కోల్పోవడంతో బాధితులంతా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు.
పహల్గామ్ భయానక ఘటన దేశ ప్రజలను హడలెత్తిస్తోంది. బాధిత కుటుంబాలకైతే ఇంకా కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఎవరిని కదిపినా.. భీతిల్లిపోతున్నారు. మంగళవారం జరిగిన మారణహోమం యావత్తు దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కళ్ల ముందే ఆప్తులను కోల్పోయిన దృశ్యాలు.. ఇంకా అందరి కళ్ల మెదలాడుతూనే ఉన్నాయి.