పహల్గామ్ ఉగ్రదాడిని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాహుల్‌గాంధీ మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత తారిఖ్ కర్రాతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడి వెనక పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థ..
టూరిస్టులే లక్ష్యంగా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలిపెట్టి.. పురుషులు టార్గెట్‌గా విచక్షణా రహితంగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు 26 మంది చనిపోగా.. పదుల కొద్ది గాయపడ్డారు. ఇక ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉండగా.. ఈ ఉగ్రదాడి జరగడం విశేషం. ఈ దాడిని జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. అలాగే ట్రంప్.. ప్రధాని మోడీకి ఫోన్ చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే రష్యా, ఇజ్రాయెల్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి.
ఇది కూడా చదవండి: Pahalgam terror attack: పహల్గామ్ దాడిపై పుతిన్ సంతాపం.. భారత్‌కి అండగా ఉంటాం..
ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ పర్యటనను కుదించుకుని బుధవారం భారత్‌కు చేరుకున్నారు. అంతేకాకుండా హోంమంత్రి అమిత్ షాతో ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సంఘటనాస్థలికి వెళ్లి పరిస్థితుల్ని సమీక్షించాలని ఆదేశించారు.
2019లో పుల్వామా దాడి తర్వాత అత్యంత ఘోరమైన దాడి ఇదే. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి పాల్పడింది.
ఇక బాధిత కుటుంబాలకు హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు:
0194-2457543, 0194-2483651
ఆదిల్ ఫరీద్, ADC శ్రీనగర్ – 7006058623
24/7 టూరిస్ట్ హెల్ప్ డెస్క్ – పోలీస్ కంట్రోల్ రూమ్, అనంతనాగ్
9596777669 | 01932-225870
వాట్సాప్: 9419051940
జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ హెల్ప్‌లైన్‌లు:
8899931010
8899941010
99066 63868 (నిస్సార్ అసిస్టెంట్ డైరెక్టర్ టూరిజం)
99069 06115 (ముదస్సిర్ టూరిస్ట్ ఆఫీసర్)