పహల్గామ్ మృతుల కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించింది.
పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో మంగళవారం టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డ నరహంతకుల ఫొటోను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. తొలుగ ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశాక.. తాజాగా నలుగురు అనుమానితుల ఫొటోను తాజాగా భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో వణికిపోతున్నారు. భారత ఆర్మీని చూసినా కూడా మహిళలు, చిన్నారులు గజగజలాడిపోతున్నారు. నిన్నటి ఘటనతో ఒక విధమైన భీతావాహ వాతావరణం ఏర్పడింది.
పహల్గామ్ దాడిలో మరో భారత వైమానిక దళ సభ్యుడు కార్పోరల్ తేజ్ హైల్యాంగ్ (30) చనిపోయాడు. సెలవుల్లో భార్యతో కలిసి కాశ్మీర్‌లోని పహల్గామ్ వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో భార్యతో కలిసి విహరిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు తెగబడ్డారు.
శ్రీనగర్‌లో పహల్గామ్ బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకముందు పహల్గామ్ భౌతికకాయాలకు అమిత్ షా నివాళులర్పించారు.
పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఉగ్రవాది ఏకే-47 రైఫిల్‌తో చెలరేగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనాస్థలిలో ఒక ముష్కరుడు రైఫిల్‌తో ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అమెరికాకు చెందిన కోల్‌కతా టెక్కీ బితాన్ అధికారి(40), భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి భారత్‌కు వచ్చాడు. ఫ్లోరిడాలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 8న కోల్‌కతాలోని సొంతింటికి వచ్చాడు. సరదాగా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశాడు. అలా కాశ్మీర్‌లోని పహల్గామ్కు వెళ్లారు.
శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పహిల్గామ్ మృతదేహాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసింది.
‘‘నిన్ను చంపను.. వెళ్లి మోడీ’’కి చెప్పు అంటూ కర్ణాటక మహిళతో ఉగ్రవాది సంభాషించాడు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ వివాహిత విలవిలలాడిపోయింది. తన భర్త మృతదేహాన్ని విమానంలో శివమొగ్గకు తరలించాలని ప్రభుత్వాధికారులను వేడుకుంటోంది
రెండు నెలల క్రితమే పెళ్లైంది. సంసారం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. దంపత్య జీవితాన్ని ఆ జంట ఆస్వాదిస్తోంది. భార్యతో కలిసి అలా సరదాగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేశారు. హనీమూన్‌కు కాశ్మీర్ అయితే బాగుంటుందని భావించారు.