Pahalgam Terror Attack: భార్య, కుమారుడితో అమెరికా నుంచి వచ్చాడు.. ఉగ్రదాడిలో కోల్‌కతా టెక్కీ మృతి
- భార్య, పిల్లలతో అమెరికా నుంచి వచ్చాడు
- పహల్గామ్ టూర్‌కు వెళ్లిన బితాన్ ఫ్యామిలీ
- మంగళవారం ఉగ్రదాడిలో కోల్‌కతా టెక్కీ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన కోల్‌కతా టెక్కీ బితాన్ అధికారి(40), భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి భారత్‌కు వచ్చాడు. ఫ్లోరిడాలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 8న కోల్‌కతాలోని సొంతింటికి వచ్చాడు. సరదాగా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశాడు. అలా కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లారు. మంగళవారం బితాన్ అధికారి భార్య, కుమారుడితో సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి ముష్కరులు కాల్పులు జరిపారు. భార్య, కుమారుడి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని వృద్ధ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. కన్నీటి పర్యాంతం అయ్యారు. ఉగ్రవాదులు.. భార్య, కుమారుడి జోలికి రాలేదు. కేవలం బితాన్ మాత్రమే చంపేసి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి!
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ఇక బితాన్ అధికారి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోహినికి ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని కోల్‌కతా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో కూడా మమత వెల్లడించారు. ‘‘పహల్గామ్ ఘటనలో మృతిచెందిన బితాన్ అధికారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. భార్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఓదార్చడానికి మాటలు రావడం లేదన్నారు. భౌతికకాయం ఇంటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.’’ అని మమత వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: పహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళి
పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా కనీసం 26 మంది మరణించారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించనున్నారు.
My heart goes out to the families of the victims of the devastating terrorist attack on the tourists in Jammu and Kashmir today.
One of the victims, Sri Bitan Adhikari, is from West Bengal. I have talked with his wife over phone. Though no words are enough to console her in…
— Mamata Banerjee (@MamataOfficial) April 22, 2025
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!