రెండు నెలల క్రితమే పెళ్లైంది. సంసారం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. దంపత్య జీవితాన్ని ఆ జంట ఆస్వాదిస్తోంది. భార్యతో కలిసి అలా సరదాగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేశారు. హనీమూన్‌కు కాశ్మీర్ అయితే బాగుంటుందని భావించారు. అంతే అలా కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇద్దరూ వాలిపోయారు. అయితే ముష్కరుల రూపంలో మృత్యువు దూసుకొస్తుందని ఊహించలేకపోయారు. టెర్రరిస్ట్ జరిపిన తూటాలకు అక్కడికక్కడే యూపీకి చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయాడు. భార్య అతడి దగ్గరే కన్నీటితో కుప్పకూలిపోయింది. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్
శుభం ద్వివేది.. నూతన వధూవరుడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వాసి. ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. సెలవుల్లో భార్యతో కలిసి కాశ్మీర్‌కు వెళ్లాడు. మంగళవారం పహల్గామ్‌లో భార్యతో కలిసి విహరిస్తుండగా.. ఉగ్రవాది దగ్గరకు వచ్చి ముస్లిమా? కాదా? అని పేరు అడిగిన తర్వాత ఒక్కసారిగా తూటాలు కురిపించాడు. భార్య కళ్ల ముందే శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది. బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 2 నెలల క్రితమే పెళ్లి అయిందని.. ఇంతలోనే విహారయత్ర పీడకలగా మారిందంటూ బంధువులు ఆవేదన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Capitals: ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. భావోద్వేగ పోస్ట్..