Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. రూ.10లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
- రూ.10లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ మృతుల కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్‌లో జరిగిన దాడిలో ఇద్దరు విదేశీయలతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలను, చిన్నారులను విడిచి పెట్టేశారు. ఇక ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉండడం విశేషం.
ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. కాశ్మీర్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక సంఘటనాస్థలిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. అలాగే బాధిత కుటుంబాలను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇది కూడా చదవండి: Pahalgam Terrorist Attack: రాత్రి వైజాగ్‌కు సీఎం చంద్రబాబు.. చంద్రమౌళి మృతదేహానికి నివాళులు!
ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. హుటాహుటినా భారత్‌కు వచ్చేశారు. ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర కేబినెట్ నిర్ణయాలను తెలియజేయనున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, చైనా, నేపాల్, ఇరాన్, ఇటలీ, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: ఉగ్రవాదులను ఏరివేయడంలో అజిత్ దోవల్ దిట్ట.. అజిత్ తదుపరి వ్యూహం ఏంటి?
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?