దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. 124 సంవత్సరాల తర్వాత అత్యంత భారీ వర్షం శుక్రవారం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం కూడా బీభత్సం సృష్టించొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Hyderabad: బరితెగించిన కామాంధులు.. భర్త కళ్లెదుటే..
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కార్లు ధ్వంసం అయ్యాయి. ఇక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. రహదారులు ధ్వంసం అయ్యాయి. వందలాది వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 500 విమానాల సర్వీసులు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: Nagarjuna : పాన్ ఇండియా చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..
దేశ రాజధానిలో శుక్రవారం 24 గంటల్లో 77 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొంది. 1901 తర్వాత మే నెలలో రెండో అత్యధిక వర్షపాతం ఇదేనని తెలిపింది. ఇక 2021, మే 20న 119.3 మి.మీ వర్షపాతం నమోదై రికార్డ్ సృష్టించింది. శుక్రవారం ఢిల్లీ వాసులంతా మెట్రో రైల్లోనే ప్రయాణం చేశారు.