ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మాంసం, మద్యం మరియు అభ్యంతరకమైన ప్రకటనలు నిషేధిస్తూ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రామమందిరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ నిషేధం అమలు కానుంది. ఇప్పటికే ఈ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ తాజాగా పురుషులు, స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల ప్రకటనలతో పాటు పాన్, గుట్కా, బీడీ, సిగరెట్లు ఉత్పత్తుల ప్రకటనలను కొత్తగా నిషేధం విధించింది. అయోధ్య, ఫైజాబాద్‌లను కలిపే రామ్‌పథ్ రహదారి 14 కిలోమీటర్ల పొడవునా ఈ నిషేధం అమల్లో ఉండనుంది.
ఇది కూడా చదవండి: PM Modi: శశిథరూర్ నా పక్కన నిలబడడంతో నిద్రపట్టదేమో.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్
అయోధ్య మేయర్ గిరీష్ పాటి త్రిపాఠి మాట్లాడుతూ.. నగరం యొక్క ఆధ్యాత్మిక మరియు మతపరమైన స్వభావాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత పవిత్రను కాపాడాలని నగర పాలక సంస్థ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, పన్నెండు మంది కార్పొరేటర్లతో కూడిన అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కార్యనిర్వాహక కమిటీ ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Canabarro Lucas : 116 ఏళ్ల జ్ఞాపకం.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత..
అర కిలోమీటర్ పరిధిలో ఉన్న మాంసాహారం అందించే హోటళ్లు.. తమ స్థానాలు మార్చుకోవాలని సూచించారు. ఆలమ పవిత్రను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అయితే దాదాపు హోటళ్లకు 50 సంవత్సరాల వరకు లైసెన్స్ ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ఈ హోటళ్లలో ఎక్కువగా మాంసాహారమే వడ్డిస్తుంటారు. తాజా నిర్ణయాలతో వేరే చోటికి మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.