అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్.. అనంత్ అంబానీ ఫ్యామిలీతో కలిసి
దాండియా ఆటలతో సందడి చేశారు. ఉదయపూర్‌లో జరిగే భారతీయ-అమెరికన్ వివాహం కోసం గురువారం ట్రంప్ జూనియర్, ఆయన భార్య వెనెస్సా ట్రంప్ భారత్‌కు వచ్చారు. పర్యటనలో భాగంగా గురువారం తాజ్‌మహల్‌ను సందర్శించారు.
ఇది కూడా చదవండి: Al-Falah University: హర్యానా పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. అల్-ఫలాహ్ అక్రమాలపై సిట్ ఏర్పాటు
అనంతరం అనంత్ అంబానీ ఫ్యామిలీ ఆహ్వానం మేరకు గుజరాత్‌కు వెళ్లారు. జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన వంటారా వన్యప్రాణాలు కేంద్రాన్ని సందర్శించారు. అలాగే సమీపంలోని ఒక దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో కలిసి ట్రంప్ జూనియర్ దంపతులు దాండియా ఆడారు. ఇక తాజ్‌మహల్‌ను సందర్శించిన తర్వాత ప్రపంచంలోనే గొప్ప అద్భుతాల్లో ఒకటి అని ట్రంప్ జూనియర్ అభివర్ణించారు. ఇక జామ్‌నగర్‌లో కార్యక్రమాలు ముగించుకుని ఉదయ్‌పూర్‌లో జరిగే పెళ్లి కోసం వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళిక.. ఈసారైనా ఫలించేనా?
ఇదిలా ఉంటే ఏప్రిల్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా భారత్‌ను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి తాజ్‌మహల్‌ను వీక్షించారు. ‘‘అందమైన చారిత్రాత్మక ప్రదేశం’’ అని జేడీ వాన్స్ అభివర్ణించారు. ఆత్మీయ స్వాగతం పలికినందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.