ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ప్రధానంగా వినిపించిన పేరు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్ర డాక్టర్ల బృందం.. దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్నారు. టెర్రర్ మాడ్యూల్ బయటపడిన కొన్ని గంటలకే నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ జరిగింది. కారులో ఉన్న ఉగ్రవాది ఉమర్ సహా 15 మంది చనిపోయారు. పదులకొద్ది గాయాలు పాలయ్యారు. ఇక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాక.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం బండారం బయటపడింది. యూనివర్సిటీ కేంద్రంగానే డాక్టర్ల బృందం పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా తేల్చారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో డాక్టర్ ఉమర్ ఇల్లును భద్రతా దళాలు పేల్చేశారు. తాజాగా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ సంస్థల అధినేత జావాద్ అహ్మద్ సిద్ధిఖీకి చెందిన పూర్వీకుల నివాసం కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేయగా.. చివరిగా మరోసారి జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Ambani Family Dance: అనంత్ అంబానీ ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు
జావాద్ అహ్మద్ సిద్ధిఖీ మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో పుట్టి పెరిగాడు. ఈ ప్రాంతం భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మస్థలం. ప్రస్తుతం ఈ పట్టణం పేరు కూడా మార్చబడింది. మోవ్‌లో ప్రస్తుతం జావాద్ పూర్వీకులకు చెందిన ఇల్లు ఉంది. ఇల్లు కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఇల్లు జావాద్ తండ్రి, దివంగత మహ్మద్ హమ్మద్ సిద్ధిఖీ పేరు మీద ఉన్నప్పటికీ.. ఉగ్ర లింకులు అల్-ఫలాహ్ కేంద్రంగా బయటపడడంతో అధికారులు కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ భవనాన్ని ‘‘మౌలానా భవనం’’గా స్థానికులు పిలుస్తుంటారు. నాలుగు అంతస్థుల్లో ఈ బిల్డింగ్ ఉంది. చాలా కాలం జావాద్ కుటుంబం ఇక్కడే నివాసం ఉంది. ఈ భవనం 1990లో నిర్మించారు. 25 కంటే ఎక్కువగా కిటికీలు, పెద్ద బేస్‌మెంట్ ఉంది. కంటోన్మెంట్ ఇంజనీర్ హరిశంకర్ కలోయా అధికారికంగా నోటీసు అందజేశారు. నిర్మాణం అనధికారికంగా పరిగణించబడుతుందని నోటీసులు పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో జావాద్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు.
ఇక ఈ వారంలోనే జావాద్ తమ్ముడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీ(50)ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లుగా కేసులు ఉన్నాయి. హమూద్ వేరే గుర్తింపుతో ఉన్నట్లు కనిపెట్టారు. గచ్చిబౌలిలో స్టాక్ మార్కెట్ పెట్టుబడి సంస్థను నిర్వహిస్తున్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. హమూద్‌ను ఎవరో రహస్యంగా దాచడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కనిపెట్టారు. గ్యాస్ సిలిండర్లు వేరే చిరునామాతో డెలివరీ అయినట్లుగా గుర్తించారు.
జావాద్ అహ్మద్ సిద్ధిఖీ బ్యాగ్రౌండ్ ఇదే..
జావాద్ అహ్మద్ సిద్ధిఖీ (61).. ఇతడే అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ స్థాపకుడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లోనే ఈ యూనివర్సిటీ ఉంది. ‘‘అల్-ఫలాహ్’’ అంటే అరబిక్‌లో విజయం, శ్రేయస్సు అని అర్థం. ఇక జావాద్ నవంబర్ 15, 1964లో జన్మించాడు. హమ్మద్ అహ్మద్ సిద్ధిఖీకి పుట్టిన ముగ్గురు కుమారుల్లో జావాద్ ఒకడు. మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో పెరిగాడు. ఇది భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మస్థలం. జావాద్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్, ప్రొడక్ట్ డిజైన్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం జావాద్ కుటుంబం ఢిల్లీకి మకాం మారింది. ఇక 1993లో జామియా మిలియా ఇస్లామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్‌గా జావాద్ పని చేయడం ప్రారంభించాడు. ఇక్కడే అతగాడి కలలు పెరిగాయి. తన ఆశయాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచించాడు.
జావాద్ లెక్చరర్‌గా పని చేస్తుండగా అల్-ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రారంభించాడు. కొద్దికాలంలోనే సంస్థ బహుగా పురోగతి సాధించింది. ఆయా ప్రాంతాల్లో డజను వెంచర్లు విస్తరించాయి. దీనికి జావాదే డైరెక్టర్, ఛానలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ యూనివర్సిటీలో చదివే విద్యార్థులంతా జావాద్‌నే రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. అంతగా పాపులరిటీని సాధించాడు. ఇక జావాద్.. జామియా నగర్‌లో ఒక విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. అల్-ఫలా హౌస్‌గా పిలవబడే ఈ ఇంట్లోనే ప్రతి ఏడాది చాలా గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటాడు. ఈ ఏడాది కూడా చాలా గ్రాండ్‌గా వేడుకలు జరుపుకునేందుకు ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఢిల్లీ బాంబ్ పేలుడుతో యూనివర్సిటీ బండారం బయటపడింది.
ఇక జామియా నగరం కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని జావాద్ విస్తరించాడు. తన సోదరుడితో కలిసి కొన్ని చిన్న కంపెనీలను కూడా స్థాపించాడు. ఇందులో ప్రధానంగా అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటి ఉంది. అయితే ఇందులో పెట్టుబడులు పెడితే అధిక రాబడి వస్తుందంటూ జావాద్ నమ్మ బలికాదు. దీంతో చాలా మంది పెట్టుబడులు కూడా పెట్టారు. అంతే ఇదే అదునుగా భారీ మోసానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా పెట్టుబడులన్నింటీని అపహరించాడు. దీంతో 2000లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కేఆర్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు (నం.43/2000) ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఈ కేసును ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసి జావాద్‌ను అరెస్ట్ చేసింది. సోదరుడితో కలిసి మూడేళ్లు జావాద్ జైల్లో ఉన్నాడు. 2023 మార్చిలో బెయిల్‌కు అప్లై చేసుకుంటే తిరస్కరణకు గురైంది. పెట్టుబడులను వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తేల్చింది. చివరికి 2004లో బెయిల్ లభించింది. ఇక అంతలోనే 2005లో పాటియాలా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. పెట్టుబడిదారులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నిర్దోషిగా విడుదల చేసింది.
ఇక ఫరీదాబాద్‌లో స్థాపించిన కళాశాలను.. అనంతరం అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా 2019లో తరగతులు ప్రారంభం అయ్యాయి. చౌకగా వైద్య విద్యను అందించడంతో చాలా మంది విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించారు. మైనారిటీ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఇక ఇందులో చదివిన కొంత మంది హిందు విద్యార్థులు కూడా ముస్లింలుగా మారారని.. హిజాబ్‌లు, బుర్ఖాలు ధరించడం వంటివి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కోవిడ్ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కరోనా సమయంలో నర్సులు జీవిత బీమా డిమాండ్ చేసినందుకు వెంటనే వారిని తొలగించేశారని ఆరోపణలు ఉన్నాయి. స్టైపెండ్‌లు చెల్లించకపోవడాన్ని నిరసించినందుకు మెడికల్ ఇంటర్న్‌లను కూడా సస్పెండ్ చేసేశారు.
యూనివర్సిటీ కేంద్రంగా అనేక దుర్మార్గాలు జరిగినట్లుగా అందులో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో ఈ భండారం వెలుగులోకి వచ్చింది. అయితే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్-ఫలాహ్ యూనివర్సిటీ దుర్మా్ర్గాలు అనేకమైనవి వెలుగులోకి వచ్చాయి. ఈ యూనివర్సిటీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా వైద్యులు మారణహోమం సృష్టించాలని ప్రణాళికలు రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి. దర్యాప్తు సంస్థలు ముందుగానే అప్రమత్తం అవ్వడంతో ఈ కుట్ర కోణం బయటపడింది. లేదంటే దేశంలో మరిన్ని దాడులు జరిగుండేవి. ఎంతో మంది ప్రాణాలు పోయేవి.
