కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపట్టింది. మొట్టమొదటిగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈ ప్రత్యేక సర్వేను ఈసీ చేపట్టింది. మొదటి నుంచి విపక్షాలకు చెందిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే సర్వే కారణంగా ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్న దుర్ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CJI BR Gavai: నేను లౌకికుడిని.. ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నా.. వీడ్కోలు ప్రసంగంలో గవాయ్ వ్యాఖ్య
ఈ నేపథ్యంలో బెంగాల్‌లో తక్షణమే ‘SIR’ నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఒక ప్రణాళిక లేకుండా ఈ సర్వే చేపడుతున్నారని ఆరోపించారు. అధిక పని భారంతో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా, బలవంతంగా, ప్రమాదకరంగా జరుగుతున్న ఈ సర్వే వెంటనే నిలిపివేసేలా తక్షణ చర్య తీసుకోవాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను మమతా కోరారు. మూడు పేజీల లేఖలో అనేక విషయాలను మమత ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Al-Falah University: ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్
సరైన శిక్షణ లేకుండానే ఈ కార్యక్రమం చేపడుతున్నారని.. ఇది చాలా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. డాక్యుమెంటేషన్‌పై కూడా స్పష్టత లేదన్నారు. ఇక ఓటర్లు జీవనోపాధి కారణంగా ఈ ప్రత్యేక సర్వేలో పాల్గొనలేకపోతున్నారని.. ప్రస్తుత ప్రక్రియ నిర్మాణాత్మకంగా చాలా బలహీనంగా ఉందని వివరించారు. పౌరులపై బలవంతంగా అమలు చేయడం అనేది ఏ మాత్రం భావ్యంగా లేదని పేర్కొన్నారు. బీఎల్‌వోలకు అధిక పని కారణంగా ఆన్‌లైన్ డేటా ఎంట్రీ, సర్వర్ సమస్యలు, తగినంత శిక్షణ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో స్పష్టం చేశారు.
Sharing herewith my latest letter to the Chief Election Commissioner, articulating my serious concerns in respect of the ongoing SIR…. pic.twitter.com/7cbOOQl7Ax
— Mamata Banerjee (@MamataOfficial) November 21, 2025