Chidambaram: ఇండియా కూటమిపై చిదంబరం హాట్ కామెంట్స్.. బీజేపీపై ప్రశంసలు
- ఇండియా కూటమిపై హాట్ కామెంట్స్
- బీజేపీపై ప్రశంసలు కురిపించిన చిదంబరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమికి భవిష్యత్ అంత ఉజ్వలంగా లేదని.. బీజేపీ మాత్రం బలంగా ఉందని కొనియాడారు. సల్మాన్ ఖుర్షీద్ మరియు మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘‘కాంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్’’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిదంబరం పాల్గొని మాట్లాడారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇండియా కూటమి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందో లేదో తనకు కచ్చితంగా తెలియదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ప్రతి విభాగంలోనూ బలంగా ఉందని చెప్పారు. ఒకవేళ ఇండియా కూటమి చెక్కుచెదరకుండా ఉంటే తాను చాలా సంతోషిస్తానన్నారు. 2029 నాటికైనా కూటమి పుంజుకుంటుందేమో చూడాలన్నారు. రాజకీయ అనుభవంతో చెబుతున్నాను.. బీజేపీ మాత్రం అంత్యంత బలంగా ఉందన్న మాట వాస్తవమన్నారు. ఇలాంటి పార్టీ మరొకటి లేదన్నారు. అన్ని యంత్రాంగాలను బీజేపీ నియంత్రిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అనుమతించబడినంత వరకు ఒక బలీయమైన యంత్రాంగమేనని పేర్కొన్నారు. 2029 ఎన్నికలు మాత్రం చాలా కీలకమైన ఎన్నికలు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: JK Encounters: 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం.. సైన్యం వెల్లడి
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ సన్నిహితులకు పార్టీకి భవిష్యత్తు లేదని తెలుసునని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఇండియా కూటమి నేతలు బాగానే ఉన్నారు. ఎన్నికలు ముగిశాక.. ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు కలిసి పని చేయలేదు. త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కలిసి ఉంటారా? లేదా? అన్నది తెలియాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!