Rajnath Singh: భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం
- భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం
- గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన రాజ్‌నాథ్‌సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్‌ను రాజ్‌నాథ్‌సింగ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌పై భారత్ విజయానికి భుజ్ ప్రత్యక్ష సాక్ష్యం అని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని.. మన వాయుసేన అసమాన పరాక్రమం చూపిందని కొనియాడారు. సరిహద్దు దాటకుండానే పాక్‌లోని టార్గెట్స్‌ను ధ్వంసం చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Ramprasad Reddy: త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
పాకిస్థాన్.. భుజ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుందని.. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని.. వీటిన్నింటినీ భారత వాయుసేన తప్పికొట్టిందని వెల్లడించారు. మన భూభాగంపై ఎలాంటి నష్టం జరగకుండానే అడ్డుకుందని తెలిపారు. భారత వాయుసేన.. పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం, అలాగే మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Konda Surekha : అవినీతి చేసేవాళ్లే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్‌ను పున:పరిశీలించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)ను కోరారు. పాకిస్థాన్‌కు సాయం చేస్తే పరోక్షంగా ఉగ్రవాదానికి నిధులు ఇచ్చినట్లే అవుతుందని తెలిపారు. పాకిస్థాన్‌కు ఇచ్చే ఏదైనా ఆర్థిక సహాయం అది ఉగ్రవాదానికేనని.. దీంతో ఐఎంఎఫ్ తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్‌లోని ప్రతి మూలకు.. ఉగ్రవాదం దాగి ఉన్న ప్రతి చోటికి కూడా తాము చేరుకోగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి నిరూపించినందుకు ఐఏఎఫ్‌ను రక్షణ మంత్రి ప్రశంసించారు. ప్రజలు అల్పాహారం తీసుకునే సమయంలోపే వాయుసేన.. పాక్ ఉగ్రవాదులను హతమార్చారని కొనియాడారు. పాకిస్థాన్ చాలా కాలంగా ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తోందని.. ఉగ్రవాదులకు పాకిస్థాన్ సురక్షిత స్వర్గధామంగా మారిపోయిందని.. ఒసామా బిన్ లాడెన్ కూడా 2011లో పాకిస్థాన్‌లోనే దాక్కుకున్నట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ రెండు విడతలగా 2.1 బిలియన్ల సాయం చేస్తోంది. ఆ సాయాన్ని నిలిపివేయాలని రాజ్‌నాథ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!