దేశంలో కొత్త నోట్లు రాబోతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ.20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాబోయే నోట్ల డిజైన్, ఫీచర్లు ప్రస్తుతం మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ చెలామణిలో ఉన్న మాదిరిగానే ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. రాబోయే కొత్త నోట్లతో పాటే పాత నోట్లు చలామణి అవుతాయి. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ యథావిథిగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Free Bus Scheme: మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన
గతంలో జారీ చేసిన రూ .20 నోట్లు గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధి నాయకత్వం మార్పు తర్వాత సాధారణంగా జరిగే ప్రక్రియే.
ఇది కూడా చదవండి: Jharkhand: ప్రియుడితో బెడ్‌రూంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే?