పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలపై చర్చించాలని విపక్షాలు కోరాయి. ఐక్యత, సంఘీభావం కోసం వీలైనంత త్వరగా ఉభయ సభల్లో చర్చించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. అయితే అందుకు కేంద్రం ఆసక్తిగా లేనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ అంశంపై చర్చించాలని.. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ భారీగా నష్టపోయింది. వైమానిక స్థావరాలతో పాటు 50 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 100 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. ఇక ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో రక్షణ శాఖను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.50వేల కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీలో ఎలాంటి విచారం లేదు: రవిశాస్త్రి