ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్‌లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని తాన్య త్యాగి కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తెలిపింది. జూన్ 17న చనిపోయిందని.. మరణానికి కారణాలేంటో తెలియదని పేర్కొంది.
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సేవలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. జూన్ 12 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు బీహార్. ఒడిశాలో మోడీ పర్యటించనున్నారు. రూ.18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటి సారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఇరాన్‌తో యుద్ధం కారణంగా రెండోసారి తన కుమారుడి పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఇది వ్యక్తిగత నష్టంగా అభివర్ణించారు
ఇరాన్‌పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.
టెక్ సిటీ బెంగుళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఆగ్నేయ బెంగళూరులోని ఎంఎన్ క్రెడెన్స్ ఫ్లోరా అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో దిగ్భ్రాంతికరమైన దృశ్యం భయాందోళన కలిగిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. క్షిపణుల ప్రయోగాలతో ఇరు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు పక్షాలు పరస్పరం వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆస్పత్రిని ఢీకొట్టింది. దీంతో ఆస్పత్రిలోని కొంత భాగం ధ్వంసమైంది.