ఓటర్ ఐడీ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఓటర్ గుర్తింపు కార్డులు 15 రోజుల్లో అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త కార్డు లేదా అప్డేట్ కార్డులను 15 రోజుల్లోనే ఇవ్వాలని సూచించింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
హనీమూన్ మర్డర్ కేసు వెనుక ఉన్న మిస్టరీని మేఘాలయ పోలీసులు ఒక్కొ్క్కటిగా ఛేదిస్తున్నారు. ఇక 243 ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. సోనమ్.. సంజయ్ వర్మ అనే వ్యక్తి మధ్య మార్చి 1 నుంచి 25 వరకు దాదాపు 119 కాల్స్ నడిచాయి.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. కలకలం కలిసుండాల్సిన ఆలుమగలు.. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ కాపురాలను కూల్చుకుంటున్నారు. నిత్యం ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పరస్పర దాడులతో ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్లో కీలక కమాండర్లు సహా అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తం అయింది.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మొహసిన్ ఫక్రిజాదే.. ఇరాన్ అణు పితామహుడు. ఇరాన్ అణు ఆశయాల వెనుక ఉన్నది ఇతడే. కానీ ఇతన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఎలా లక్ష్యంగా చేసుకుందో.. ఏమో తెలియదు గానీ.. అత్యంత రహస్యంగా టెహ్రాన్‌లో 2020లో గురి చేసి కాల్చి చంపేసింది.