మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ మాక్ టెస్ట్‌లో కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. విచక్షణ మరిచి చెక్క కర్రతో చితకబాదాడు. అనంతరం పట్టించుకోకపోవడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది.
గుజరాత్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సూరత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
గోడలకు చెవులుంటాయని.. గూఢచారులుంటారని పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇక నేటి ప్రపంచం అప్డేట్ టెక్నాలజీలో ఉంది. రాతియుగం నుంచి ఏఐ టెక్నాలజీకి వచ్చాం. ఏం జరిగినా క్షణాల్లో బయటకు వచ్చే అత్యంత టెక్నాలజీలో ఉన్నాం. ఈ విషయం కొంచెం తెలివి ఉన్నవాళ్లకైనా అర్థమవుతుంటుంది.
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక మహిళా వైద్యురాలు సంస్కారం మరిచి విమానంలో హద్దులు దాటి ప్రవర్తించింది. విమాన సిబ్బంది వారించినా పట్టించుకోకుండా ఒక డాన్లో ప్రవర్తించింది.
ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఇజ్రాయెల్‌కు ఉందని ప్రధాని బెంజెమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం చేసేందుకు అమెరికా రంగంలోకి దిగబోతుందంటూ వార్తలు వచ్చాయి.
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను రెండు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్‌పై దాయాది దేశాధినేతలు ఒక్కొక్కరు నోరు విప్పితున్నారు. తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని కీలకమైన వైమానిక స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసిందని ఇషాక్ దార్ అంగీకరించారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది.