Shocking Incident: బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో భారీగా అస్థి పంజరాలు లభ్యం!
- బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో షాకింగ్ ఘటన
- భారీగా అస్థి పంజరాలు లభ్యం!
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగుళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఆగ్నేయ బెంగళూరులోని ఎంఎన్ క్రెడెన్స్ ఫ్లోరా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో దిగ్భ్రాంతికరమైన దృశ్యం భయాందోళన కలిగిస్తోంది. అపార్ట్‌మెంట్‌లో ఒక మురికి గుంటను కాంట్రాక్ట్ కూలీలు శుభ్రం చేస్తుండగా పుర్రెలు, ఎముకలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా వారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంఛార్జ్‌కు సమాచారం అందించారు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అవశేషాలను పరిశీలిస్తున్నారు. మానవ అవశేషాలా? లేదంటే జంతువులవా? అని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kubera : కుబేర వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు.. రికవరీ టార్గెట్ పెద్దదే
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
జూన్ 16న అపార్ట్‌మెంట్‌లోని కార్ పార్కింగ్ దగ్గర ఉన్న పెర్కోలేషన్ పిట్‌ను కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు. ఇంతలో వారికి భారీగా పుర్రెలు, ఎముకలు కనిపించాయి. దీంతో వారంతా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్ లాబొరేటరీకి పంపించారు. అస్థి పంజరాలు మానవులవా? జంతువులవా? రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని బేగూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు వారంలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Iran-Israel : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎటుపోతోంది? ముస్లిం దేశాల స్టాండ్ ఏంటి? ఇండియాపై ప్రభావమెంత?
దాదాపుగా ఈ అపార్ట్‌మెంట్ పదేళ్ల నుంచి ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో 45 ప్లాట్లు ఉన్నాయి. నీటి నిర్వహణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా అవశేషాలు బయటపడ్డాయి. అయితే ఈ అపార్ట్‌మెంట్ నిర్మించక ముందు ఇక్కడ స్మశానం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. స్మశానవాటికను ఆక్రమించి అపార్ట్‌మెంట్ కట్టినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే అస్థిపంజరాలు బయటపడినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయినా కూడా రిపోర్ట్ వచ్చేంత వరకు క్లారిటీ రాదని తెలిపారు. బేగూర్ పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 194(3)(iv) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో మొత్తం 16 గుంతలు ఉండగా.. ఒక గుంతలో ఈ అవశేషాలు బయటపడినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?